Share News

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:13 AM

ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో విశాఖ వాసి బాడిద ఉమా మహేశ్వర రావు(49) మృతిచెందారు.

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

  • మృతిచెందిన విశాఖ వాసి

పూసపాటిరేగ, జూన్‌ 30(ఆంధ్ర జ్యోతి): ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో విశాఖ వాసి బాడిద ఉమా మహేశ్వర రావు(49) మృతిచెందారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి.. రహదారి పక్కన ఉన్న లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జు నుజ్జు కాగా.. డ్రైవర్‌ కారులో ఇరుక్కు పోయి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం విజయనగరం జిల్లా కేంద్రా సుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఉమామహేశ్వరరావు విశాఖపట్టణంలోని పీఎం పాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:13 AM