Share News

Licences to Be Cancelled నిబంధనలు ఉల్లంఘిస్తే.. లైసెన్స్‌లు రద్దు

ABN , Publish Date - Jul 01 , 2026 | 11:48 PM

Licences to Be Cancelled for Rule Violations ఎరువుల పంపిణీ, విక్రయాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్‌ హెచ్చరించారు. పార్వతీపురం పట్టణంతో పాటు మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో డీఏవో ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

Licences to Be Cancelled   నిబంధనలు ఉల్లంఘిస్తే.. లైసెన్స్‌లు రద్దు
పార్వతీపురంలోని ఓ గోడౌన్‌లో స్టాకు పరిశీలిస్తున్న డీఏవో

  • ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

పార్వతీపురం టౌన్‌, జూలై1(ఆంధ్రజ్యోతి): ఎరువుల పంపిణీ, విక్రయాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్‌ హెచ్చరించారు. పార్వతీపురం పట్టణంతో పాటు మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో డీఏవో ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల క్రయ, విక్రయాలు, ఓపెనింగ్‌ స్టాక్‌ బుక్‌, రిజిస్టర్‌ ఈపీవోఎస్‌తో పాటు ఏపీఎఐఎంఎస్‌ లెక్కలను క్షణ్నంగా పరిశీలించారు. సంగం వలస, గంగాపురం రైతు సేవ కేంద్రాల్లో ఎరువుల వివరాలు, స్టాక్‌ నిల్వలపై ఆరా తీశారు. ఏజన్సీలు లేదా డీలర్లు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని డీఏవో తెలిపారు. లైసెన్సులు రద్దు చేసి తక్షణమే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. అవసరమైయితే క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా కాల్విటీ కంట్రోల్‌ అధికారి రవీంద్ర తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 11:48 PM