EAPCET ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో మన్యం విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:47 PM
Manyam Students Shine in AP EAPCET Results ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో ఉత్తమ మార్కులు దక్కించుకున్నారు.
గరుగుబిల్లి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో ఉత్తమ మార్కులు దక్కించుకున్నారు. గరుగుబిల్లి మండలం హిక్కింవలసకు చెందిన పెంట శ్రీశాంత్ ఇంజనీరింగ్ విభాగంలో 17వ ర్యాంకు సాధించాడు. లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 142.8234 మార్కులు పొందాడు. గతంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో ఓబీసీ కేటగిరీలో 19వ ర్యాంకు, కామన్ విభాగంలో 123వ ర్యాంకు సాధించాడు. శ్రీశాంత్ గుడివాడలో టెన్త్ , హైదరాబాద్‌లోని ప్రైవేట్ విద్యాలయాల్లో ఇంటర్ పూర్తి చేశాడు. తెలం గాణ ఎంసెట్‌లో 48వ ర్యాంకు సాధించ ాడు. ప్రస్తుతం ఢిల్లీలోని ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అయ్యాడు. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వసంతలక్ష్మిలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు.