ఎన్నికల నిర్వహణపై మంగళవారం దెందేరు జడ్పీ హైస్కూల్‌లో నమూనా ప్రక్రియను నిర్వహించి... విద్యా ర్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ పనితీరుతో పాటు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో తెలియజేశారు.
ఉనికి కాపాడుకోవడం కోసమే ప్రభు త్వంపై వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలి పారు.
యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.
డ్రగ్స్ నిర్మూలనను సహకరించాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లిమర్ల నియోజకవర్గంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు అభ్యుదయ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
How Long With In-Charges? జిల్లాలో గృహ నిర్మాణ శాఖకు అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్నేళ్లుగా ఇన్‌చార్జిల పాలనతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా ఏర్పడి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత వైసీపీ సర్కారు పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక పర్యవేక్షణ కొరవడుతోంది.
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. మంగళవారం జిల్లాలో పలు చోట్ల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా-మీకోసం వారోత్సవాలను అధికారులు, కూటమి నాయకులు నిర్వహించారు.
No Changes at All రాష్ట్రంలో మరో మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది. కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు, ఒక మండలం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఎటువంటి మార్పులు చేయలేదు.
No Phone… Love the Book! నేటి సమాజంలో యువత, పిల్లలు ఎక్కువుగా మొబైల్ ఫోన్లకు హత్తుకుపోతున్నారని, పుస్తక పఠనంతో మేథస్సు మెరగవుతుందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘ఫోన్ వద్దు.. పుస్తకం ముద్దు’ అని తెలిపారు. మంగళ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు.
Crime Control Through Technology నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్థుల ను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో వర్చువల్‌గా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు.
“President!” Chant the Students పాఠశాల విద్యార్థులు అసెంబ్లీలో అధ్యక్షా! అనేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ సమస్యలతో పాటు పలు అంశాలపై గళమెత్తనున్నారు. ఇందుకోసం వారంతా అమరావతికి పయనమయ్యారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా విద్యార్థులు పాల్గొను న్నారు.