Share News

అన్ని వర్గాల బడ్జెట్‌

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:21 AM

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

అన్ని వర్గాల బడ్జెట్‌

  • ఎంపీ కలిశెట్టి

విజయనగరం రూరల్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత ఐవీపీ రాజుతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమా నంగా తీసుకువెళ్తూ ఈ బడ్జెట్‌ని రూపొందించారన్నా రు. ప్రజల జీవితాల్లో ఈ బడ్జెట్‌ పలు మార్పులకు శ్రీకారం చుట్టనుందన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూనే మరో వైపు పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. ఇక ధరల స్థిరీకరణ నిధి కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షే మానికి ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలి పారు. వీటితో పాటు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించారని, తాగునీరు, సాగునీరు తదితర వాటికి ప్రాఽధాన్యత ఇచ్చారని చెప్పారు. ఈ బడ్జెట్‌ రాష్ట్ర అభి వృద్ధికి, ప్రజల సంక్షేమానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:21 AM