సమావేశంలో నిలబడి నిరసన
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:19 AM
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీడీవో నీలం అప్పలనాయు డు ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.
జామి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యో తి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీడీవో నీలం అప్పలనాయు డు ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జామి ఎంపీటీసీ-2 వేచలపు వరలక్ష్మి అనేక సమస్యలపై ప్రస్తావించా రు. జామిలో శ్మశానవాటిక సమస్య, అగ్రహారం భూముల సమస్య, కాలువల పూడికతీత పనులపై ఐదేళ్లుగా ప్రశ్నిస్తున్నా పరిష్కారం కాలేదని సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె సమావేశం పూర్తయినంత వరకూ నిలబడి నిరసన తెలియజేశారు.