వ్యాను ఢీకొని బాలుడి మృతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:17 AM
వ్యాను ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన ఇప్పిలిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
రాజాం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): వ్యాను ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన ఇప్పిలిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజాం ఎస్‌ఐ పి.ఉమావెంకటే శ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్రాజు చీపురుప ల్లి గ్రామానికి చెందిన మడ్డు నారాయణరావు కుమారుడు లోహిత్(9) శివరాత్రి సందర్భంగా ఆదివారం తన స్వగ్రామం నుంచి కుటుంబీకులతో కలిసి తన తాతగారి ఇంటికి ఇప్పిలిపే ట వచ్చాడు. అయితే అక్కడ లోహిత్ రోడ్డు దాటుతున్న సమయంలో చీపురుప ల్లి నుంచి రాజాం వైపు అతివేగంగా వస్తున్న వ్యాను ఢీకొంది. గాయాలపాలైన బాలుడిని వెంటనే స్థానికులు స్థానిక కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికి త్స అందించినప్పటికీ బాలుడు మృతిచెందాడు. బాలుడి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.