Share News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:18 AM

మండలంలోని అలమండ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్లెంపూడి రాములమ్మ(55) అనే మహిళ మృతి చెందింది.

 రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

జామి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అలమండ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్లెంపూడి రాములమ్మ(55) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్‌ఐ వీరజనార్దన్‌ ఆదివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాములమ్మ శనివారం సాయంత్రం పొలంలో పని పూర్తిచేసుకుని ఇంటికి బయలుదేరింది. ఇదే సమయంలో లక్కవరపుకోట మం డలం తామరాపల్లి గ్రామానికి చెందిన ఖండేపల్లి దేవరాజు తన వ్యానుతో విజ యనగరం వైపు వెళ్తూ వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాములమ్మను విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరి కి మృతిచెందింది. మృతురాలికి వివాహం జరిగిన ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బా యి ఉన్నాడు. భర్త చెల్లయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ సుగుణకరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:18 AM