ఆంధ్రప్రదేశ్‌ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
పార్టీ కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు.
భారత్, శ్రీలంక మహిళల మధ్య ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపక్కన డంప్ చేస్తే వాహనాలకు భారీ జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి, యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ స్పష్టంచేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంజూరైన రూసా 2.0 నిధులను వినియోగించుకోవడంలో పాలకులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.
విశాఖ ప్రజల పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. శనివారం జిల్లాలోని తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటలో ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమానికి హాజరైన అనంతరం తాళ్లపాలెం లేఅవుట్లో అనకాపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఆదివారం నుంచి మూడు రోజులు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 1 లక్షా 29 వేల 959 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి చక్కగా ముస్తాబు కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.