కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:53 AM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ముంచంగిపుట్టులో 9.7, అరకులోయలో 9.8, పెదబయలులో 11.1, చింతపల్లిలో 13.8, జి.మాడుగులలో 14.5, కొయ్యూరులో 16.2, అనంతగిరిలో 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో 9.7 డిగ్రీలు
కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా తగ్గని చలి
పాడేరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ముంచంగిపుట్టులో 9.7, అరకులోయలో 9.8, పెదబయలులో 11.1, చింతపల్లిలో 13.8, జి.మాడుగులలో 14.5, కొయ్యూరులో 16.2, అనంతగిరిలో 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తగ్గని చలి తీవ్రత
మన్యంలో కొన్నాళ్లుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. అలాగే ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ మంచు కురవడం, మధ్యాహ్నం మాత్రమే ఒక మోస్తరుగా ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రి తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది.