Share News

మత్స్యలింగేశ్వరా నమోనమః

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:55 AM

మండలంలోని మఠం పంచాయతీలో గల మత్స్యలింగేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

మత్స్యలింగేశ్వరా నమోనమః
విశేష అలంకరణలో మత్స్యలింగేశ్వరస్వామి

మత్స్యగుండానికి పోటెత్తిన భక్తజనం

ఘనంగా ముగిసిన ఉత్సవాలు

హుకుంపేట, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మఠం పంచాయతీలో గల మత్స్యలింగేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేసిన భక్తులు సోమవారం వేకువజాము నుంచే మత్స్యలింగేశ్వరస్వామి దర్శనానికి బారులుతీరారు. అనంతరం మత్స్యగుండంలో వెలిసిన మత్స్యాలకు భక్తులు పూజలు చేశారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయి. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్థానిక సీఐ నాయుడు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Feb 17 , 2026 | 12:55 AM