Share News

మెయిన్స్‌లో మెరిశారు

ABN , Publish Date - Feb 17 , 2026 | 01:47 AM

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం గత నెల చివరి వారంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ తొలి దశ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.

మెయిన్స్‌లో మెరిశారు

జేఈఈలో సత్తా చాటిన విశాఖ విద్యార్థులు

అత్యధికంగా 99.998 పర్సంటైల్‌ సాధించిన ముగ్గురు

నగరంలో పరీక్షలకు 30,000 మంది హాజరు

3,000-4,000 అర్హత సాధించినట్టు సమాచారం

విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం గత నెల చివరి వారంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ తొలి దశ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. విశాఖలో మూడు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు సుమారు 30 వేల మంది హాజరయ్యారు. ఇప్పటివరకూ ఉన్న వరకు సమాచారం ప్రకారం మూడు నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ప్రస్తుత పర్సంటైల్‌, ఏప్రిల్‌లో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి పర్సంటైల్‌ను కలిపి ర్యాంకులను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో నగరంలోని కార్పొరేట్‌ విద్యా సంస్థలు శ్రీచైతన్య, నారాయణ, ఎసెంట్‌ తదితర సంస్థలకు చెందిన విద్యార్థులు అత్యధిక పర్సంటైల్‌ సాధించారు. శ్రీచైతన్య ఐఐటీ అకాడమీకి చెందిన పి.భార్గవనాయుడు, కె.హిమకర్‌, ఎం.నాగ సహస్ర 99.998 పర్సంటైల్‌, నారాయణ ఐఐటీ అకాడమీకి చెందిన మణికంఠ 99.998 పర్సంటైల్‌ సాధింయారు. వీరితోపాటు ఇతర విద్యా సంస్థలకు చెందిన పలువురు 95.998 నుంచి 99.998 పర్సంటైల్‌ను సాధించి ప్రతిభను కనబరిచారు.

Updated Date - Feb 17 , 2026 | 01:47 AM