Share News

శరవేగంగా రైల్వే అండర్‌ పాస్‌వే పనులు

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:56 AM

అరకులోయ- చొంపి మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద రైల్వే అధికారుల పర్యవేక్షణలో అండర్‌ పాస్‌వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

శరవేగంగా రైల్వే అండర్‌ పాస్‌వే పనులు
సిద్ధమవుతున్న రైల్వే అండర్‌ పాస్‌వే

అరకులోయ- చొంపి మధ్య నిర్మాణం

అరకులోయ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): అరకులోయ- చొంపి మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద రైల్వే అధికారుల పర్యవేక్షణలో అండర్‌ పాస్‌వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే అండర్‌ పాస్‌కు ఇటు, అటు అప్రోచ్‌ రోడ్లు నిర్మిస్తున్నారు. నెల రోజుల పాటు అరకులోయ నుంచి చొంపి వెళ్లే మార్గాన్ని మూసి వేసి పనులు చేపట్టేందుకు కలెక్టర్‌ను రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు అనుమతి కోరారు. అనుమతి లభించడంతో యుద్ధప్రాతిపదికన రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. ఈ అండర్‌ పాస్‌వే పూర్తయితే అరకులోయ నుంచి చొంపి, సిరగం, మాడగడ, బస్కీ తదితర గ్రామాల ప్రజలకు రైల్వే గేటు కష్టాలు తీరతాయి. ఏ సమయంలోనైనా వాహనదారులు రాకపోకలు సాగించే వీలు ఉంటుంది. రైల్వే అండర్‌ పాస్‌వే పనులు చేపడుతుండడంపై పలు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 17 , 2026 | 12:56 AM