• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ

కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ

దసరాకు విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు స్వగ్రామాలకు తరలివెళుతుండడంతో పాడేరులోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఆటో, జీపు స్టాండులు కిటకిటలాడుతున్నాయి.

చెరువులవేనం రోడ్డుకి మోక్షం

చెరువులవేనం రోడ్డుకి మోక్షం

ప్రముఖ పర్యాటక కేంద్రం చెరువులవేనం గ్రామానికి రహదారి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. రహదారి నిర్మాణాలకు ఏడాదిన్నర క్రితం రూ.2.4 కోట్ల పీఎం జన్‌మన్‌ నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అటవీ శాఖ అభ్యంతరం చెప్పడంతో రోడ్డు నిర్మాణం నిలిచింది. చివరకు వారం రోజుల క్రితం అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. రహదారి నిర్మాణానికి పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఉద్యోగం పేరుతో వైసీపీ మాజీ కౌన్సిలర్ ఘరానా మోసం

ఉద్యోగం పేరుతో వైసీపీ మాజీ కౌన్సిలర్ ఘరానా మోసం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.50 వేల నగదు, 35 గ్రాముల బంగారం తీసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. వైసీపీ మాజీ కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరిపై చర్యలు తీసుకుని తమ నగదు, బంగారం తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు.

జోనల్‌ కమిషనర్‌పై మళ్లీ విచారణ

జోనల్‌ కమిషనర్‌పై మళ్లీ విచారణ

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కె.చక్రవర్తి.. కిందిస్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలపై గతంలో షోకాజ్‌ నోటీసు జారీచేసి వివరణ తీసుకున్నప్పటికీ, మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి, పక్షం రోజుల్లో నివేదిక సమర్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సుమారు పది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

ఓపెన్‌గా... చెత్త తరలింపు

ఓపెన్‌గా... చెత్త తరలింపు

జీవీఎంసీ పరిధిలో పోగవుతున్న చెత్తను పర్యావరణానికి హాని లేకుండా శాస్త్రీయంగా పునర్వినియోగించాలనే ఆశయానికి అధికారుల నిర్లక్ష్యం అవరోధంగా మారింది.

స్థానిక ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు

స్థానిక ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు

గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, ఎంసీటీసీ/ జడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అన్ని ఎన్నికలను బ్యాలట్‌ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ జిల్లాలో ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

గ్రేటర్‌లో ఎన్నికల సందడి

గ్రేటర్‌లో ఎన్నికల సందడి

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్‌ జారీచేసే అవకాశం ఉండడంతో ఆశావహులు, అధికారుల్లో కోలాహలం మొదలైంది.

పవర్ ఫుల్

పవర్ ఫుల్

గ్రామీణ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు నివారించడానికి, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు, వ్యవసాయ రంగానికి నిర్ణీత వేళల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వం కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడిలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 220 కిలోవాట్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు కానున్నది. ఇది అందుబాటులోకి వస్తే చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుకానున్నది.

బియ్యానికి బదులు నగదు?

బియ్యానికి బదులు నగదు?

జిల్లాలో బియ్యం కార్డుదారులకు బియ్యానికి బదులు నగదు చెల్లింపు ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది.

జనసేన పార్లమెంట్‌ సమన్వయ కమిటీ

జనసేన పార్లమెంట్‌ సమన్వయ కమిటీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంట్‌ సమన్వయ కమిటీని నియమించింది. కూటమిలో మిగిలిన రెండు పార్టీలతోపాటు సొంత పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం అఽధినేత పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఈ కమిటీ నియామకం జరిగినట్టు సమాచారం.



తాజా వార్తలు

మరిన్ని చదవండి