Share News

తగ్గని చలి తీవ్రత

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:15 AM

మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం కూడా పొగమంచు దట్టంగా కమ్మేసింది.

తగ్గని చలి తీవ్రత
పాడేరు- విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో మంగళవారం ఉదయం పొగమంచు

దట్టంగా పొగమంచు

అరకులోయలో 8.3 డిగ్రీలు

పాడేరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం కూడా పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగానే పొగమంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. మంగళవారం అరకులోయలో 8.3, ముంచంగిపుట్టులో 10.2, చింతపల్లిలో 10.8, పెదబయలులో 11.0, జి.మాడుగులలో 12.5, కొయ్యూరులో 14.5, అనంతగిరిలో 16.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Feb 18 , 2026 | 12:15 AM