Share News

నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:40 PM

ఆరోగ్య సమస్యలు సృష్టించే నులిపురుగుల నివారణ ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు.

నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం
గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో బాలికకు నులిపురుగుల నివారణ మాత్ర వేస్తున ్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

ఉమ్మడి అల్లూరి జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 3,19,881 మందికి మాత్రలు పంపిణీ

పాడేరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సమస్యలు సృష్టించే నులిపురుగుల నివారణ ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో పలువురు బాలికలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే విధిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకమారు 19 ఏళ్లులోపు వారందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను వేయడం ద్వారా వారికి సులిపురుగుల ద్వారా సంక్రమించే సమస్యలు దూరమవుతాయన్నారు.

3,19,881 మందికి మాత్రలు పంపిణీ

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా మంగళవారం ఉమ్మడి అల్లూరి జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 19 వేల 881 మంది బాలలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కృష్ణమూర్తినాయక్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 3 లక్షల 26 వేల 910 మంది బాలలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టి, తొలి రోజు మంగళవారం 3 లక్షల 19 వేల 881 మందికి (97.85 శాతం) వేశామన్నారు. మిలిగిన బాలలకు ఈ నెల 24న ఆల్బెండజోల్‌ మాత్రలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.ప్రతాప్‌, జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌, జిల్లా మలేరియా అధికారి ప్రభావతి, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:40 PM