వివాదాలకు కేంద్రాలుగా మారుతున్న పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో లోపాలను గుర్తించడంపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా (ఏయూఏఏ-ఎన్ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్ల్యాండ్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు.
సరదాగా క్రికెట్ ఆడుకుని, తిరిగి ఇంటికి బయలుదేరిన యువకులను వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యువై కబళించింది.
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని రావలమ్మపాలెంలో ఆదివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబు, ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీతో కలసి రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనకాపల్లి- ఆనందపురం ఆరు వరుసల జాతీయ రహదారిపై అనకాపల్లి మండలం కోడూరు వద్ద డివైడర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ జి.రవికుమార్ తెలిపిన వివరాలిలా వున్నాయి.
వెనుకబడిన వర్గాల (బీసీ) రాజకీయ, సామాజిక సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది. స్థానిక సంస్థల్లో అన్ని రకాల పదవులు కలిపి 28.18 శాతం మేర బీసీలకు కేటాయించింది.
అస్సాం యువతి హిమశ్రీ బోరో మృతి కేసులో కీలక ముందడుగు పడింది. కదులుతున్న రైలు నుంచి ఆమె పడిన తీరుపై సిమ్యులేషన్ ఆపరేషన్ను పోలీసులు ఆదివారం ప్రయోగించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జీఆర్పీ, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ సిమ్యులేషన్ ప్రయోగం నిర్వహించారు.
కోల్కతా నుంచి హైదరాబాద్కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులకు సమాచారమందింది. దీంతో వారు విస్తృత తనిఖీలు చేపట్టారు.
నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్న స్థానిక రైతు బజారులో మరికొద్ది రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. రూ.3 కోట్ల వ్యయంతో కూటమి ప్రభుత్వం నిర్మించిన ఈ రైతు బజారును గత నెలలో ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో సిద్ధమైన ఈ రైతు బజారులో దుకాణాల కేటాయింపు ప్రక్రియ మిగిలి ఉంది.
మునిసిపల్, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లతో పాటు సన్నద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.