డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:19 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.
సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు
మద్దిలపాలెం (విశాఖపట్నం), ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో ఆయన కాన్వాయ్‌లో లేరు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం కాన్వాయ్ పవన్‌కల్యాణ్ వద్దకు వెళుతున్న సమయంలో సిరిపురం జంక్షన్ వద్ద అందులోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న మరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాన్వాయ్‌లో ఉన్న చివరి వాహనం మాత్రం డ్యామేజ్ అయింది. ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ సీఐ అమ్మినాయుడు, త్రీటౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణలపై విచారణ చేపట్టారు.
అప్పన్న హుండీ ఆదాయం 1.49 కోట్లు
సింహాచలం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు గత 21 రోజుల్లో హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.49 కోట్లు ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో బుధవారం పరకామణి కేంద్రంలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కించారు. ఇందులో రూ.1,49,03,091 నగదు రూపంలో, 187 గ్రాముల స్వర్ణం, 5.775 కిలోల రజితం ఆభరణాల రూపంలో లభించింది. యూఎస్‌ఏకు చెందిన 190 డాలర్లు, యుఏఈకు చెందిన 90 దీరమ్స్, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 20 వేల మింగ్స్, మలేషియాకు చెందిన 1,980 ఆర్‌ఎంఎస్‌లు, ఆస్ట్రేలియాకు చెందిన 100 డాలర్లు, ఇంగ్లాండ్‌కు చెందిన ఐదు పౌండ్లు, ఒమన్, సింగపూర్, నేపాల్, ఖతర్, సౌదీ దేశాల కరెన్సీ లభించింది. కార్యక్రమంలో వివిధ విభాగాల చెందిన ఏఈవోలు, పర్యవేక్షణాధికారులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.