మైదాన ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకున్నది.
‘అరకు చలి ఉత్సవ్’ను వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహిస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అసలే అధ్వానంగా వున్న జీకేవీధి-సీలేరు అంతర్రాష్ట్ర రహదారి... తుఫాన్ కారణంగా కురిసిన కొద్దిపాటి వర్షాని మరింత దారుణంగా తయారైంది. జీకేవీధి నుంచి లంకపాకల వరకు రహదారిపై అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ తుహిన్‌సిన్హా సూచించారు. ఫార్మాసిటీలోని మాన్‌కైండ్ ఫార్మా పరిశ్రమను గురువారం ఆయన సందర్శించారు.
తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎలమంచిలి తులసీనగర్‌లోని జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ మువ్వల రాంబాబును విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సమీర్‌శర్మ పిలుపునిచ్చారు.
విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల (జూ)తో పాటు ఎదురుగా ఉన్న కంబాలకొండ అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సింగపూర్ జూ తరహాలో విశాఖ జూను అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సింగపూర్ వెళ్లి అన్నీ పరిశీలించారు. అక్కడి జూ నిర్వాహకులను విశాఖపట్నం పిలిపించారు. వారికి రెండు రోజుల పాటు విశాఖ జూను, కంబాల కొండను చూపించారు.
ట్రాఫిక్ విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంపై ‘గజిబిజి, గందరగోళం’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ముఖ్యమైన కూడళ్లలో విధులు నిర్వర్తించే సిబ్బందిలో కొందరు వాహనాల రాకపోకలను పట్టించుకోకుండా సెల్ఫోన్లలో రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుండడం, సిగ్నల్ జంప్ చేసిన వాహనాలను చూసీచూడనట్టు వదిలేస్తుండడంపై ఫొటోలతో సహా కథనం ప్రచురితమవ్వడంతో అధికారులు స్పందించారు.
‘నవ్విపోదురుగాక...’ అన్నచందంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ వ్యవహారశైలి మారిపోతోంది. ప్రజాధనం ఖర్చుచేసే అంశంలో అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన స్టాండింగ్కమిటీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖ గాజువాక సర్కిల్-3 ఏఎస్వో బి.కృష్ణ బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గాజువాకకు చెందిన ఎ.నారాయణ వాహనాలు రెండు ఐదు నెలల కిందట అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా ఏఎస్వో కృష్ట పట్టుకుని న్యూపోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనాలను విడుదల చేయాలని పలుమార్లు ఏఎస్‌వోను కోరినప్పటికీ పట్టించుకోలేదు.