గోవాడ షుగర్స్‌ను ఆదుకోండి
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:00 AM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పీపీపీ విధానంలో డిస్టిలరీ లేదా ఇథనాల్ ప్లాంట్‌గా మార్చి, వచ్చే సీజన్ నుంచి చెరకు క్రషింగ్‌ను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు శుక్రవారం శాసనసభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పీపీపీ విధానంలో డిస్టిలరీ లేదా ఇథనాల్ ప్లాంట్
రైతులు, కార్మికులకు బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టాలి
శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాజు
చోడవరం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పీపీపీ విధానంలో డిస్టిలరీ లేదా ఇథనాల్ ప్లాంట్‌గా మార్చి, వచ్చే సీజన్ నుంచి చెరకు క్రషింగ్‌ను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు శుక్రవారం శాసనసభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు, ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఇదొక్కటే చక్కెర పరిశ్రమ అని, ఇది కాస్తా మూతపడడంతో చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికుల ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి పీపీపీ పద్ధతిలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.