Share News

బ్లూ జెట్‌ ఫార్మా కంపెనీకి 28న శంకుస్థాపన

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:56 AM

మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో భారీ ఔషధ తయారీ కంపెనీ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో భూమి చదును పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

బ్లూ జెట్‌ ఫార్మా కంపెనీకి 28న శంకుస్థాపన
బ్లూ జెట్‌ ఔషధ కంపెనీ కోసం నిర్మిస్తున్న రహదారి

ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్‌?

రాంబిల్లి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో భారీ ఔషధ తయారీ కంపెనీ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో భూమి చదును పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏపీఐఐసీ అధికారులు సెజ్‌ కోసం రెండో విడత సేకరించిన రాంబిల్లి మండలం జడ్‌.చింతువ రెవెన్యూ పరిధిలోని సీతపాలెం వద్ద 102.48 ఎకరాలు కేటాయించారు. సుమారు రూ.2,300 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ కంపెనీని మూడు దశల్లో నిర్మించనున్నారు మొదటి దశ 2027కు, రెండో దశ ఏప్రిల్‌ 2030కి, మూడో దశ అక్టోబరు 2031కి పూర్తి అవుతాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్న సన్వీరా కంపెనీ సమీపం నుంచి సీతపాలెం వరకు 1.4 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్టు కంపెనీ యాజమాన్యం తెలిపింది.

Updated Date - Feb 21 , 2026 | 12:56 AM