• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

శారదానది వ్యర్థాలమయం

శారదానది వ్యర్థాలమయం

పట్టణానికి ఆనుకొని ఉన్న శారదానది వ్యర్థాలమయంగా కనిపిస్తోంది. గత నెల 22వ తేదీన పెద్ద ఎత్తున వినాయక ప్రతిమల నిమజ్జనోత్సవాలను శారదానది ఒడ్డున ఘనంగా చేశారు. నదిలోకి ఎవరూ దిగి ప్రతిమలను నిమజ్జనం చేయకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో క్రేన్‌ సహాయంతో నది ఘాట్‌ నుంచి కొంత దూరంలో నిర్వాహకులు నిమజ్జనం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రాలీని వ్యాన్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఇన్‌చార్జి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన

కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన

జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో వరి సాగు బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో జిల్లాలో మాడుగుల, రాంబిల్లి మినహా మిగతా 22 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖాధికారులు జిల్లాలోని కరువు మండలాల పరిస్థితులపై అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆయా మండలాల్లో వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

వాగులే దారులు

వాగులే దారులు

జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ గంగవరం, దుప్పులవాడ పంచాయతీ డి. అగ్రహారం వద్ద వాగులపై వంతెనలు కొట్టుకుపోయి పది రోజులు గడిచినా ఇంతవరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ పిలుపునిచ్చారు.

మన్యంలో విభిన్న వాతావరణం

మన్యంలో విభిన్న వాతావరణం

అల్లూరి జిల్లా మన్యంలో శనివారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు.. తర్వాత నుంచి ఎండ, సాయంత్రం ఐదు గంటల తర్వాత వర్షం కురిసింది.

ఐక్యంగా కదిలారు.. బడికి గూడు కట్టారు

ఐక్యంగా కదిలారు.. బడికి గూడు కట్టారు

ఎవరో వస్తారు... ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమ గ్రామంలోని బడికి సొంతంగా అవసరమైన గూడును సమకూర్చి ఆదర్శంగా నిలిచారు పాడేరు మండలంలోని ఉరుగొండ గ్రామస్థులు.

అల్లం ధర భారీ పతనం

అల్లం ధర భారీ పతనం

హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతలో అల్లం ధర భారీగా పతనం అయ్యింది.

నేటి నుంచి కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగుల పెన్‌డౌన్‌

నేటి నుంచి కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగుల పెన్‌డౌన్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగులు ఆదివారం నుంచి పెన్‌డౌన్‌ నిరసన చేపట్టనున్నామని సంఘం జిల్లా కో-ఆర్డినేటర్లు గౌరిశంకర్‌, సోమేశ్‌ తెలిపారు.

అరకులోయలో స్నోయగం

అరకులోయలో స్నోయగం

అరకులోయలో శనివారం మంచు అందాలు సందర్శకులను మైమరపించాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి