పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:12 AM
మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
తగ్గని చలి తీవ్రత
ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు
పాడేరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. బుధవారం అరకులోయ మినహా పది మండలాల్లోనూ డబల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. అలాగే చలి ప్రభావం అధికంగానే ఉంది.
అరకులోయలో 7.5 డిగ్రీలు
ఏజెన్సీలో అరకులోయ మినహా అన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అరకులోయలో 7.5, ముంచంగిపుట్టులో 11.0, చింతపల్లిలో 13.2, పెదబయలులో 13.4, జి.మాడుగులలో 14.1, కొయ్యూరులో 14.4, అనంతగిరిలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.