మత్స్యగెడ్డలో పడి ఒకరి మృతి
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:23 AM
మండలంలోని మత్స్యగెడ్డలో ప్రమాదవశాత్తూ ఒక వ్యక్తి బుధవారం మృతి చెందాడు. దీనికి సంబంధిం చి అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పెదబయలు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మత్స్యగెడ్డలో ప్రమాదవశాత్తూ ఒక వ్యక్తి బుధవారం మృతి చెందాడు. దీనికి సంబంధిం చి అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరడకోట పంచాయతీ కేంద్రానికి చెందిన టి.వెంకటరమణ(35) గతంలో ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించాడు. అనారోగ్యం కారణంగా ఆపరేషన్ జరగడం తో మతిస్థిమితం కోల్పోయాడు. బుధవారం ఉదయం అతను కాలకృత్యా లు తీర్చుకోవడానికి మత్స్య గెడ్డ వద్దకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తూ ఊబిలో చిక్కుకుపోయి బయటకు రాలేక మృతి చెందాడు. ఎంతసేపటికి వెంకటరమణ ఇంటికి రాకపోవడంతో అతని భార్య రత్నకుమారి చుట్టుపక్కల వారిని వాకబు చేసింది. అతను గెడ్డలో చిక్కుకుపోయినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వెంకటేశ్ సంఘటన స్థలానికి వెళ్లి వెంకటరమణ మృతదేహాన్ని బయటకు తీయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట రమణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.