Share News

ఐఎఫ్‌ఆర్‌కు ముమ్మర ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:48 AM

తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న మిలాన్‌-2026, ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలకు బీచ్‌రోడ్డులో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఐఎఫ్‌ఆర్‌కు ముమ్మర ఏర్పాట్లు

ఆర్కే బీచ్‌రోడ్డులో 19న ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌

రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా

విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):

తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న మిలాన్‌-2026, ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలకు బీచ్‌రోడ్డులో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌. అన్ని దేశాల నౌకాదళ ప్రతినిధులతో 19వ తేదీ సాయంత్రం ఆర్‌కే బీచ్‌రోడ్డులో పరేడ్‌ నిర్వహించనున్నారు. సుమారు రెండు కి.మీ. పొడవున సాగే ఈ పరేడ్‌లో ఆయా దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి వీక్షించడానికి మూడు లక్షల మంది ప్రజలు వస్తారనే అంచనాతో బీచ్‌రోడ్డులో గ్యాలరీలు, బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. బీచ్‌లో ముఖ్య అతిథుల కోసం ఒకవైపు, ప్రేక్షకుల కోసం మరోవైపు గ్యాలరీలు నిర్మిస్తున్నారు. నోవాటెల్‌లో అంతర్జాతీయ నేవీ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:48 AM