ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మరో జలపాతం బయట పడింది. అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల పైనుంచి పాలధారలా ఉరకేస్తున్న జలపాతం గురించి తెలిసి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు.
ఎట్టకేలకు మండలంలోని బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు రోడ్డు పనులు ప్రారంభమ య్యాయి. దీంతో పలు గ్రామాలకు రవాణా కష్టాలు తీరతాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవనుకుంటున్న తరుణంలో గత నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఖరీఫ్ సాగు గట్టెక్కుతుందా? అని సందిగ్ధంలో ఉన్న గిరిజన రైతులను గత నెలలో కురిసిన భారీ వర్షాలు ఆదుకున్నాయి. ఈ వర్షాలు పంటలకు జీవం పోశాయి. దీంతో అనుకోని విధంగా ఈ ఏడాది ఖరీఫ్లో వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.
పద్మాపురం గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిని కలెక్టర్ టి.నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు.
జిల్లాలో పీఎం జన్మన్ పథకం, అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా రూ.70.68 కోట్ల అంచనా వ్యయంతో 30 తారు రోడ్లను నిర్మించామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
గడిచిన మూడేళ్లుగా త్వరితగతిన కారుణ్య నియామకాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.
అల్లూరి జిల్లాలోని చింతపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల పసిబిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కన్నతండ్రే బిడ్డను హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి సెజ్ పరిధిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈరోజు ప్రారంభించారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులను అమరావతికి మళ్లించారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. నిధుల లభ్యతకు అనుగుణంగా కాంట్రాక్టర్ల బిల్లులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.