Share News

తగ్గని చలి

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:15 PM

ఏజెన్సీలో చలి మాత్రం తగ్గలేదు. శుక్రవారం కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి ప్రభావానికి జనం వణుకుతున్నారు. ప్రధానంగా శీతలగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది.

తగ్గని చలి
ముంచంగిపుట్టులో ఉదయం దట్టంగా కమ్ముకున్న మంచు

కొనసాగుతున్న సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు

అరకులోయలో 8.0 డిగ్రీలు

ముంచంగిపుట్టులో గజగజలాడిస్తున్న చలి

పాడేరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో చలి మాత్రం తగ్గలేదు. శుక్రవారం కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి ప్రభావానికి జనం వణుకుతున్నారు. ప్రధానంగా శీతలగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది.

అలాగే మన్యంలో శుక్రవారం అరకులోయలో 8.0 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముంచంగిపుట్టులో 9.1, పెదబయలులో 9.4, చింతపల్లిలో 9.6, జి.మాడుగులలో 11.4, కొయ్యూరులో 12.7, అనంతగిరిలో 17.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో..

మండల వాసులను చలి గజగజలాడిస్తున్నది. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు దిగజారిపోవడంతో చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వయసు పైబడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉదయం 9 గంటలు దాటినా కూడా పొగమంచు వీడలేదు. మంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వస్తేగానీ కనిపించని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Feb 13 , 2026 | 11:15 PM