Share News

అంతర్జాతీయ కాఫీ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా అరకు కాఫీ

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:07 PM

బెంగళూరులో జరిగిన ఇండియన్‌ అంతర్జాతీయ కాఫీ ఫెస్ట్‌లో అరకు కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అంతర్జాతీయ కాఫీ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా అరకు కాఫీ
బెంగళూరు ఇండియన్‌ అంతర్జాతీయ కాఫీ ఫెస్ట్‌లో అరకు కాఫీ రుచుల కోసం క్యూకట్టిన అతిథులు

ఆసక్తి కనబరిచిన దేశ, విదేశీయులు

అరకు కాఫీ రుచిని ఆస్వాదించిన కాఫీ ప్రియులు

చింతపల్లి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో జరిగిన ఇండియన్‌ అంతర్జాతీయ కాఫీ ఫెస్ట్‌లో అరకు కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ. విదేశీ కాఫీప్రియులు అరకు కాఫీ రుచులను ఆస్వాదించారు. కేంద్ర కాఫీ బోర్డు, స్పెషలిటీ కాఫీ అసోసియేషన్‌ ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరులో ఇండియన్‌ అంతర్జాతీయ కాఫీ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నది. ఈఫెస్ట్‌లో దేశ వ్యాప్తంగా సాగు చేస్తున్న కాఫీ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఫెస్ట్‌కి దేశ, విదేశీయులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ ఫెస్టులో కేంద్ర కాఫీ బోర్డు సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి చింతపల్లి మండలం దిగువుపాకలు గ్రామంలో పనిచేస్తున్న ఎం.నిట్టపుట్టు రైతు ఉత్పత్తిదారుల సంఘం అరకు కాఫీ స్టాల్‌ని ఏర్పాటు చేసింది. అరకు కాఫీ ఉత్పత్తులు, తాజా కాఫీని అతిథులకు అందిస్తున్నారు. దేశవిదేశీయులు అరకు కాఫీ స్టాల్‌ వద్ద కాఫీ తాగేందుకు అమితాసక్తి చూపుతున్నారని మినుములూరు సీనియర్‌ లైజనింగ్‌ అధికారి ఎస్‌. రమేశ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీవో సీఈవో గంగరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 11:07 PM