జోరందుకున్న ఏకీకృత కుటుంబ సర్వే
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:16 PM
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత పగడ్బంధీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏకీకృత కుటుంబ సర్వే ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎట్టకేలకు జోరందుకుంది.
ఇంటర్నెట్ సదుపాయం లేక సర్వేకు ఇక్కట్లు
ఆఫ్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత పగడ్బంధీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏకీకృత కుటుంబ సర్వే ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎట్టకేలకు జోరందుకుంది. గతంలో ఇంటర్నెట్ సమస్యల కారణంగా సర్వే ప్రక్రియ సక్రమంగా సాగలేదు. అందుకు ఆఫ్‌లైన్ సదుపాయం కల్పించాలని సూచిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో గత జనవరి నెల 24న ‘సాగని ఏకీకృత కుటుంబ సర్వే’ శీర్షికన ప్రచురించిన ప్రత్యేక కథకానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆఫ్‌లైన్‌లో సైతం కుటుంబ సర్వే చేపట్టేందుకు అవకాశం కల్పించింది. దీంతో మారుమూల పల్లెల్లో సైతం సర్వే నిర్వహణకు సమస్యలు తొలగినట్టేనని సిబ్బంది అంటున్నారు. దీంతో పల్లెల్లో అవసరమైన ఆయా కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని యాప్‌లో ఆఫ్‌లైన్‌లోనే నమోదు చేసుకుని, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రాంతాలకు వచ్చి, ఆయా సమచారాన్ని ఆన్‌లైన్‌లో యాప్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చును.
ఉమ్మడి జిల్లాలో ఏకీకృత సర్వే చేసే కుటుంబాల వివరాలు
వ.సం డివిజన్ పేరు మండలాలు సచివాలయాలు మొత్తం కుటుంబాలు
1. పాడేరు 11 212 1,92,327
2. రంపచోడవరం 7 94 75,643
3. చింతూరు 4 46 46,648
-------------------------------------------------------------------------------
మొత్తం 22 352 3,14,618
------------------------------------------------------------------------------