కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ర్యాలీ శ్రీనివాసరావు (57) అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. భార్య, కుమార్తె, కుమారుడు హైదరాబాద్‌లో ఉంటుండగా, శ్రీనివాసరావు మాత్రం తన తల్లి సత్యవతితో కలిసి పీఎం పాలెంలోని ఐబీఆర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు.
విశాఖపట్నం రైల్వేస్టేషన్ రీ డెవలప్మెంట్ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో పాటే పనులు ప్రారంభమైన అనేక స్టేషన్లు అధునాతన వసతులతో సేవలు అందిస్తున్నాయి. విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ రివైజ్డ్ మాస్టర్‌ప్లాన్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
స్టీల్ ప్లాంటు మరో కొత్త టెండర్ జారీచేసింది. ప్లాంటు సరఫరా చేసే బిల్లెట్లను వివిధ సైజుల్లో ఫ్లాట్లుగా కన్వర్షన్ చేసి ఇవ్వాలనేది ఈ టెండర్ ముఖ్య ఉద్దేశం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇప్పటివరకూ ఫ్లాట్ ఉత్పత్తులను తయారు చేయలేదు. రౌండ్స్ మాత్రమే చేస్తోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టడానికి పౌర సరఫరాల శాఖ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది. ప్రతి రేషన్ డిపోలో సీసీ కెమెరాలు అమర్చాలని ప్రతిపాదించింది. తొలుత నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో అన్ని జిల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పౌర సరఫరాల శాఖ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. రేషన్ డీలర్ల అసోసియేషన్ల ప్రతినిధులు ఇటీవల పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది.
ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న తాజంగి జలాశయం పర్యాటకులకు వినోదాన్ని పంచే వేదికగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఎట్టకేలకు మంప పోలీస్ స్టేషన్‌కు సొంత గూడు సమకూరింది.
కొయ్యూరు కస్తూర్బా విద్యాలయం ఎస్వో ఎ.పరిమళను సస్పెండ్ చేస్తూ సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసీ)డి.స్వామినాయుడు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
మన్యంలో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం గజగజ వణుకుతున్నారు.
గిరిజన ప్రాంతంలో పేదలైన గిరిజనులకు తుల్డా రకం వెదురుతో జీవనోపాధి కల్పించేందుకు వెలుగు, జాతీయ ఉపాధి హామీ పథకం సంయుక్త ఆధ్వర్యంలో వెదురు ప్రాజెక్టును అమలు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక తదితర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కాస్తా.. తీవ్రంగా మారింది. మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటుతుంది.