ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:43 AM
తూర్పు నౌకాదళం విశాఖలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
విశాఖ చేరుకుంటున్న యుద్ధనౌకలు
రిహార్సల్స్ ప్రారంభం
విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):
తూర్పు నౌకాదళం విశాఖలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్కే బీచ్‌లో 19న నిర్వహించే సాహస విన్యాసాలు, సిటీ పరేడ్ కోసం గ్యాలరీల నిర్మాణ పనులు వేగవంతం చేశారు. సమీక్షకు హాజరయ్యే యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు వివిధ దేశాల నుంచి ఒక్కొక్కటిగా విశాఖ చేరుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 15కు పైగా యుద్ధ నౌకాలు విశాఖ తీరానికి చేరువగా హార్బర్ వైపు వెళుతూ కనిపించాయి. సాహస విన్యాసాల రిహార్సల్స్ కూడా మొదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం జెట్ ఫ్లైట్లు ఝూంకారం చేస్తూ గగనతలంలో విహరించాయి. నిఘా విమానాలు వెలుగులు విరజిమ్మాయి. చేతక్ హెలికాప్టర్ రక్షణ చర్యల్లో పాల్గొంది.