గ్రామ పంచాయతీల పునర్విభనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రైలులో పురిటి నొప్పులతో బాధపడిన ఓ మహిళ విశాఖ స్టేషన్‌లో సిబ్బంది సురక్షితంగా దించి అత్యవసర వైద్య సేవలందించడంతో ఆడ శిశువును ప్రసవించింది.
స్టీల్‌ప్లాంటులో రోజుకు 19 వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి తీస్తేనే మనుగడ ఉంటుందని, లేదంటే కష్టమని ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీలు శుక్రవారం స్పష్టంచేశారు.
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పెదరుషికొండలో నిర్మించ తలపెట్టిన 50 అంతస్థుల ఐకానిక్ టవర్స్ నిర్మాణంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ మార్కెట్‌లో 200 గ్రాములు రూ.100లకు విక్రయిస్తున్నారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో తొమ్మిదేళ్లుగా గిరిజన, కౌలురైతులు స్ట్రాబెర్రీ సాగు చేపడుతున్నారు.
మన్యంలో చలి గజగజ వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకసంఖ్యలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ శీతలగాలులు వీస్తున్నాయి. డిసెంబరు, జనవరి మాసాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంత వాతావరణం పర్యాటకులను ఆహ్లాదాన్ని పంచుతున్నప్పటికీ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రస్తుతం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రతకు చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యపరంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత శీతాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఆరున్నరేళ్లుగా ఆగిపోయిన బీఎన్ రోడ్డు పనులలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రంలో మార్చి నాటికి రోడ్లపై గుంతలు ఉండకూడదని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని చేసిన హెచ్చరికలు తీవ్రంగానే ప్రభావం చూపించాయి. ఫలితంగా బీఎన్ రోడ్డు పనులలో కదలిక వచ్చింది. బీఎన్ రోడ్డు పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో ప్రజలు పడుతున్న కష్టాలపై ఈనెల 22వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు రహదారులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో రెవెన్యూలో అవినీతి మర్రి ఊడల్లా విస్తరిస్తోంది.. పలు తహశీల్దారు కార్యాలయాల్లో అవినీతికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు తహశీల్దారు కార్యాలయాలే అడ్డాగా చేసుకొని భూ లావాదేవీలు సాగించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ మార్పు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టణంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థలకు చెందిన బస్సులపై సమగ్ర తనిఖీలు చేపట్టామని జిల్లా రవాణాశాఖ అధికారి జి. మనోహర్ తెలిపారు. పాఠశాలల బస్సులు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, ఎంవీ చట్టం, బస్సు బాడీకోడ్‌ల ప్రకారం పాటించబడుతున్నాయా అనే అంశాలను ఎంవీ ఇన్‌స్పెక్టర్ల ప్రత్యేక బృందాలు పరిశీలించినట్టు చెప్పారు. జిల్లాలో ఉన్న పాఠశాలల బస్సులన్నింటిని మూడు బృందాలు సూక్ష్మంగా పరిశీలించినట్టు ఆయన తెలిపారు.
అనకాపల్లి ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరబోతోంది. పదేళ్లుగా ఊరిస్తున్న రైతు బజార్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు కానుంది. ఇప్పటికే యార్డులోని నాగదుర్గమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలోని 17, 18 నంబర్లు గల బ్లాకులను సుందరంగా తీర్చిదిద్దడంలో మార్కెటింగ్ శాఖ నిమగ్నమైంది.