ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:56 AM
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
పోతురాజుబాబు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. చిత్రంలో ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
కల్యాణపులోవలో పోతురాజుబాబు దర్శనం
ఆలయంలో ప్రత్యేక పూజలు
రావికమతం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): దైవదర్శనంతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా మనశ్శాంతి లభిస్తుందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తో కలిసి ఆదివారం మండలంలోని కల్యాణపులోవ వచ్చి పోతురాజుబాబు అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రశాంతమైన వాతావరణంలో పోతురాజుబాబు, పెద్దింటమ్మవార్లను దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని ప్రపంచంలోని పలు దేశాలు మెచ్చుకొంటాయని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, దేవదాయ శాఖ అధికారులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికి, పూర్ణకుంభంతో ఆహ్వానించారు. పోతురాజుబాబు దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణనున ప్రారంభించారు.