దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:08 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో ఆదివారం ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేసింది.
తగ్గని చలి తీవ్రత
అరకులోయలో 9.7 డిగ్రీలు
పాడేరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో ఆదివారం ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేసింది. ముంచంగిపుట్టులో 7.3, అరకులోయలో 9.8, ముంచంగిపుట్టు, పెదబయలులో 10.6, చింతపల్లిలో 11.6, జి.మాడుగులలో 12.7, కొయ్యూరులో 15.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం వేళ పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. సాయంత్రం ఐదు గంటలు దాటితే చలి మొదలవుతోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.