Share News

అక్రమాల లెక్క తేలేనా?

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:11 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

అక్రమాల లెక్క తేలేనా?

ఏయూలో లోతుగా విజిలెన్స్‌ విచారణ

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై దర్యాప్తు

20 మంది అధికారులతో కూడిన బృందాల తనిఖీ

కీలక విభాగాల్లో ఫైళ్లను పరిశీలించిన సభ్యులు

ప్రిన్సిపాల్స్‌, హెచ్‌వోడీలు, విభాగాల అధికారుల కు ప్రశ్నల వర్షం

కీలక సమాచారాన్ని రాబడుతున్న వైనం

నాటి పాలకుల్లో రేగుతున్న గుబులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. నాటి పాలకులు అడ్డగోలుగా తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించిన సమా చారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారు. గత నాలుగు వారాలుగా వర్సిటీలోనే మకాంవేసి మరీ వివరాలను సేకరిస్తుం డడంతో గత పాలకుల్లో గుబులురేగుతోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీ ఉన్నతాధికారులు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలకు సంబంధించిన వ్యవహా రాలపై విజిలెన్స్‌ అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరి స్తున్నారు. అక్రమ నియామకాలు, అడ్డగోలు నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఫైనాన్స్‌, ఇంజనీరిం గ్‌తోపాటు ఇతర కీలక విభాగాల్లో తనిఖీలు పూర్తిచేశారు. ఆయా విభాగాల అధికారులను విచారించి, అప్పట్లో తీసు కున్న నిర్ణయాలు, ఎవరి ఆదేశాలతో ఫైళ్లను కదిలించారో వివరాలు సేకరించారు. సుమారు రెండు వారాలుగా ఈ తనిఖీలు సాగుతున్నాయి.

ప్రిన్సిపాల్స్‌, హెచ్‌వోడీల విచారణ

వర్సిటీలో విజిలెన్స్‌ అధికారుల విచారణ కొనసాగుతోం ది. కొద్దిరోజులుగా ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్స్‌, హెచ్‌వో డీలను విచారిస్తున్నారు. సుమారు 20 మంది విజిలెన్స్‌ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు, నలుగురు అధికారులు ప్రిన్సిపాల్స్‌, హెచ్‌వోడీలు, డీన్లు, ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్‌ నుంచి ముఖ్య మైన సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. ప్రధానంగా టీడీఆర్‌ హబ్‌ పేరుతో చేపట్టిన పీహెచ్‌డీ ప్రవేశాలు, అస్మ దీయులైన కొందరికి నిబంధనలకు విరుద్ధంగా పదవులు కట్టబెట్టిన వైనం, సైన్స్‌ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం, ఫైళ్ల తరలింపు, ప్రభుత్వం మారిన వెంటనే కీలకఫైళ్లను మాయంచేశారనే ప్రచారం, అప్పటి సెక్యూరిటీ అధికారిపై వచ్చిన ఆరోపణలు, వర్సిటీలోని చిన్నపాటి అడవిని నాశ నం చేసిన తీరు, వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా అల్లిన కథ (అసాంఘి కార్యకలాపాలకు అడ్డా), భారీ వృక్షాలను నరికించి, తరలించిన తీరు, పూర్వ విద్యార్థులు అందించిన నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రశ్నించి, వివరాలను రాబట్టినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్‌ అధికారులను మూడు నుంచి నాలుగుసార్లు కలిసి సమాచారాన్ని సేకరించారని చెబుతున్నారు. కాగా వర్సిటీలో గతంలో ఎన్నడూలేని విధంగా విజిలెన్స్‌ అధికారులు రోజుల తరబడి విచారణ చేపడుతుండడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.


తీరంలో విషాదం

సముద్రంలో మునిగి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

రుషికొండబీచ్‌లో ఘటన

స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

రుషికొండబీచ్‌లో ఈతకు దిగిన ఇంజనీరింగ్‌ విద్యార్థి కెరటాల ఉధృతితో మృతిచెందాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన ఇతడు స్థానికంగా ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. ఆరిలోవ పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి.

గాయత్రి విద్యా పరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ (మెకానికల్‌) చదువుతున్న తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కొత్తపల్లికి చెందిన పాలవలస అరవింద్‌నాయుడు, మరో ఐదుగురు స్నేహితులు కలిసి సరదాగా గడిపేందుకు ఆదివారం ఉదయం 9.40 గంటలకు రుషికొండబీచ్‌కు వెళ్లారు. కొద్దిసేపటి తరువాత స్నానం చేసేందుకు గాను సముద్రంలోకి దిగారు. అయితే అలల ఉధృతికి అరవింద్‌నాయుడు, రాజీవ్‌ నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వారు బిగ్గరగా కేకలు వేయడంతో సమీపంలో వున్న మెరైన్‌ పోలీసులు, లైఫ్‌గార్డులు వెంటనే స్పందించి, నీటిలో మునిగిపోతున్న ఇద్దరినీ తీరానికి తీసుకువచ్చారు. అరవింద్‌నాయుడు అప్పటికే నీటిని బాగా తాగేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పోలీసులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి, అరవింద్‌నాయుడుకు సీపీఆర్‌ చేశారు. కొద్దిసేపటికి వచ్చిన 108 అంబులెన్స్‌లో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:11 AM