Grain trucks crash at mills ధాన్యం విక్రయించేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల మంది రైతులు వరికోతలు పూర్తిచేశారు. సుమారు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాలుగు రోజుల కిందట సర్వర్ మొరాయించడంతో గంటలపాటు నిరీక్షించారు.
పదోతరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితా లు సాధించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ అడిషినల్ సెక్రటరీ సునీల్రాజ్కుమార్ కోరారు.
అర్హులందరికీ సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థికసాయం చేయనున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీచేశారు.
Scrub typhus cases increasing జిల్లావాసులను స్క్రబ్టైఫస్ వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా జ్వరంతో ప్రారంభమై క్రమేపీ శ్వాస సంబంధ సమస్యలకు దారి తీస్తోంది. రాష్ట్రస్థాయిలో 34 పాజిటివ్ కేసులు శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయని చెబుతుండగా, జిల్లా అధికారులు మాత్రం 7 కేసులు మాత్రమే అని పేర్కొంటున్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటు వంటి ఇబ్బంది కలిగించినా చర్యలు తప్పవని మిల్లర్లకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని ధాన్యం కొనుగో లుకు సంబంధించి ట్యాగైన్ మిల్లులను పరిశీలించారు.బ్యాంకు గ్యారెంటీలు అయిపో యినా సాయి బాలాజీ రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు అధికంగా ఉండడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మిల్లర్పై 6ఏ కేసు నమోదు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
Minister Atchannaidu visits diarrhea victims తాళ్లవలసలో ఇంటింటా ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
Files must be resolved in a timely manner జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వారం రోజుల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో ఊసవానిపేట రైల్వేగేటు ప్రాంతంలో నిర్మాణం చేపట్టనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన భూసేకరణ చేసి పూర్తి నివేదికను అందించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు.
భూగర్భ జలాలను పరిరక్షించాలని, ఇప్పటికే వ్యవసాయ బోర్ల నుంచి నీరందడం లేదని రణస్థలం పంచాయతీ నగరప్పాలేం, బండిపాలేం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు.