Share News

వంశధార తీరం.. భక్తజన సంద్రం

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:56 PM

వంశధార తీరం భక్తజన సంద్రంతో ఉప్పొంగింది. తీరంలో శివనామస్మరణ మార్మోగింది.

వంశధార తీరం..  భక్తజన సంద్రం

- వైభవంగా శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నానం

వంశధార తీరం భక్తజన సంద్రంతో ఉప్పొంగింది. తీరంలో శివనామస్మరణ మార్మోగింది. మహా శివరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీముఖలింగేశ్వరుడు పార్వతీ సమేతంగా ఎల్‌.ఎన్‌.పేట మండలం మిరియాపల్లి రేవులో చక్రతీర్థ స్నానమాచరించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు జిల్లాతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఒడిశా నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే వంశధార నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్నారు. తొలుత పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను అర్చకులు నంది వాహనంపై ఊరేగించి మిరియాపల్లి రేవుకు తీసుకువెళ్లి చక్రతీర్థ స్నానం చేయించారు. ఈ ఊరేగింపులో సుమారు 3లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Feb 18 , 2026 | 11:56 PM