Share News

బడ్జెట్‌ ఏపీ ప్రజల ఆశల మేనిఫెస్టో

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:03 AM

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉం చుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ కాదని... ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల మేనిఫెస్టో అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

బడ్జెట్‌ ఏపీ ప్రజల ఆశల మేనిఫెస్టో

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉం చుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ కాదని... ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల మేనిఫెస్టో అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశ చర్చలో భాగం గా బుధవారం ఆయన సభలో ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నాయ కత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గ ట్టెక్కిస్తూ.. స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ దిశగా కూటమి ప్ర భుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. జలవ నరుల శాఖకు రూ.18,224 కోట్లు కేటాయించ డం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టిందన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి రూ.19,306 కోట్లు కేటాయించడం ద్వారా జిల్లా లోని ఉద్దానం కిడ్నీ బాధితులకు కార్పొరేట్‌ స్థా యి వైద్య సేవలు అందుతాయని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు నిస్సి గ్గుగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

వంతెనలను నిర్మించండి

  • పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): వంశధార, మహేంద్రతనయ నదులపై వంతెనల నిర్మాణం చేపట్టా లని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు కోరారు. వంశధార నదిపై ఉన్న గొట్టాబ్యారేజీకి ప్రత్యామ్నాయంగా భగీరఽథపురం వద్ద మరో వంతెన నిర్మించాలని కోరారు. దీని వల్ల గొట్టాబ్యారేజీపై ఒత్తిడి తగ్గి... దీర్ఘకాలిక మన్నికకు అవకాశం ఉంటుందన్నారు. పాతపట్నం మండలంలో బూరగాం, పాతపట్నం వద్ద మహేం ద్రతనయపపై వంతెనల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. వంశధార నదిపై కల్లట- జిల్లేడుపేట మధ్య వంతెన నిర్మాణానికి 2019లో టీడీపీ ప్రభుత్వం శంకు స్థాపన చేసిందని గుర్తు చేశారు.ఆ తరువాత అధికారిలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వ నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిపోయిందని వివరించారు. రీటెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. మహేంద్రతనయ నదిపై బూరగాం గ్రామం వద్ద వంతెన నిర్మాణం జరిపితే ఆవలి వైపు భూములు గల రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. వర్షాకాలంలో కె.గోపాలపురం, హెచ్‌ .గోపాలపురం గ్రామాలకు ఇక్కట్లు తప్పుతాయని అన్నారు.

మరణించిన వారి ఓట్లు తొలగించాలి

  • ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు

రణస్థలం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ ఓటు ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలి పెట్టని... మరణించిన వారి ఓట్లు తక్షణమే తొలగించాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు కోరారు. బుధవారం అ సెంబ్లీలో జీరో అవర్‌లో ఆయ న మాట్లాడుతూ ఓటర్ల జాబి తాలో పూర్తి పారదర్శకత ఉం డాలన్నారు. సరికొత్త ఓటర్ల జాబితాను ప్రభుత్వం ఏటా నా లుగుసార్లు విడుదల చేయాలని కోరారు. అర్హులైన యువకులకు సమయానికి ఓటు హక్కు కల్పించాలన్నారు. స్వచ్ఛమైన, పార దర్శకమైన ఓటర్ల జాబితా ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దామని ఆయన కోరారు.

‘వంశధార’ ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇవ్వండి

  • నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు కల్పవల్లిగా ఉన్న వంశధార కాలువ ఆధుని కీకరణకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. బుధవారం అసెంబ్లీ సమాశంలో జీరో అవర్‌లో రమణమూర్తి మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువ నుంచి నరసన్నపేట నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో 67వేల ఎకరాలకు.. టెక్కలి, పలాస నియోజకవర్గాలకు సాగునీరు అందుతోందన్నారు. గతంలో ఆధునికీకరణకు శ్రీకారం చుట్టామని.. ప్రభుత్వం మారడం.. వైసీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. శివారు ప్రాంతాలకు సాగునీరు అందక.. ముందుభాగంలో ఉన్న రైతులకు కాలువలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కాలువ ఆధునికీకరణ పనులు చేపడితే సాగునీరుతోపాటు వరదల నుంచి రక్షణ పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. తీవ్రంగా నష్టపోతున్న చెరకు రైతులను ఆదుకోవాలన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:03 AM