Share News

వైన్‌షాప్‌లో చోరీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:05 AM

నగరంలోని ఫాజుల్‌బాగ్‌ పేట ప్రధాన రహదారి వద్ద ఉన్న లక్కీ వైన్స్‌లో బుధవారం చోరీ జరిగింది.

వైన్‌షాప్‌లో చోరీ

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఫాజుల్‌బాగ్‌ పేట ప్రధాన రహదారి వద్ద ఉన్న లక్కీ వైన్స్‌లో బుధవారం చోరీ జరిగింది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్కీవైన్స్‌లో మంగళవారం జరిగిన వ్యాపార లావాదేవీల సొమ్ము రూ.2 లక్షలు, ఒక సెల్‌ఫోన్‌ను సేల్స్‌ సిబ్బంది సత్యనారాయణరాజు, శ్రీనివాసరావు కౌంటర్‌లో భద్రపరిచి యథావిఽధిగా రాత్రి 10 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు షాపు తెరిచేందుకు రాగా షట్టర్‌కు వేసిన రెండు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని గమనించిన యజమాని మీసాల రామారావుకు ఫోన్‌లో తెలిపి టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. రామారావు ఫిర్యాదు మేరకు టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సచివాలయ కార్యదర్శి ఇంట్లో..

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): నగరంలోని సీపన్నాయుడుపేటలో నివసిస్తున్న సచివాలయ కార్యదర్శి కొత్తకోట సుజాత ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో ఐదు తులాల బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించారు. టూటౌన్‌ పోలీసులు తెలిపి వివరాలిలా ఉన్నాయి.. సుజాత తన భర్త స్వామి బాబుతో కలిసి ఈనెల 14న శనివారం రాజమండ్రి తదితర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లారు. వెళ్లే ముందు సుమారు ఐదు తులాలున్న నల్లపూసల తాడు, బ్రాస్‌లెట్‌, ఉంగరం, చెవిబుట్టల బంగారం వస్తువులను బెడ్‌రూమ్‌లో ఉన్న మంచం బాక్సులో భద్రపరిచి ఇంటికి తాళం వేశారు. తిరిగి 16వ తేదీ సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. సోమవారం విధులకు బయలుదేరే సమయంలో బంగారు వస్తువులు వేసుకుందామని బాక్సు తెరిచి చూసేసరికి ఆ వస్తువులు లేకపోవడంతో సుజాత, ఆమె భర్త బుధవారం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Feb 19 , 2026 | 12:05 AM