lokesh tour రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు గురువారం రాత్రి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో మంత్రి లోకేశ్ పాల్గొనున్నారు.
గతనెల 26న తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన గుంట రాజు(25) మృతదేహం బుధవారం అతడి స్వగ్రామం వీరరా మచంద్రపురానికి చేరుకుంది.
నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు న్యాయాధికారి జైలుశిక్ష విధించారు.
స్థానిక బాలాజీనగర్‌కు చెందిన తడక లక్ష్మీనారాయణ(84) అనే వృద్ధుడు కోదూరు గ్రామ చేరువలో గల పంట పొలా ల్లో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగుచూసింది.
పోలీస్ క్వార్టర్స్ వద్ద పాత జాతీయ రహ దారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డా రు.
బుడితి కంచు హస్తకళలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ధాన్యం కొనుగొలులో రైతులకు ఇబ్బం దులు లేకుండా చూడాలని జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు.
Grading system ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని విద్యాశాఖ మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. ఉపాధ్యాయుల ప్రతిభను అంచనా వేసి ఏ,బీ,సీ,డీ గ్రేడ్‌లను ఇవ్వనుంది. 2017లో గ్రేడింగ్ విధానంలో ఉపాధ్యాయుల బదిలీల్లో అదనపు పాయింట్లు ఇచ్చారు. ఈసారి గ్రేడింగ్ విధానం ద్వారా ఉపాధ్యాయుల బదిలీల్లో అదనపు పాయింట్లతో పాటు విద్యావ్యవస్థను బలోపేతానికి భాగస్వామ్యం చేయనున్నారు.
Education instructors ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న స్థానంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘకాలం కిందట రెగ్యులర్ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లు పనిచేసేవారు. తాత్కాలిక ప్రాతిపదికన వారిని తీసుకొని పారితోషికం చెల్లించేవారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పేరుతో ఆ విధానాన్ని తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టారు.
Moolapet port జిల్లాలోని ప్రతిష్టాత్మక మూలపేట(గతంలో భావనపాడు) గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్(పోర్ట్స్)శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు(జీఓ ఆర్టీ 94) జారీ చేశారు.