వెనుకబడిన వర్గాల సాధికారతతో సామాజిక న్యాయం
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:50 PM
సమాజంలో వెనుక బడిన వర్గాల సాధికారతతోనే సామాజిక న్యాయం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం రూరల్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సమాజంలో వెనుక బడిన వర్గాల సాధికారతతోనే సామాజిక న్యాయం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సింగుపురం గ్రామం లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు లో ఎక్కడైనా అసమానతలుున్నా, అర్హులైన వారికి ఫలాలు అందక పోయినా బాధితులు తక్షణం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్ర దిస్తే వారికి ఉచితంగా న్యాయ సేవలు అందించి వారికి దక్కాల్సిన హక్కులను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఎం.శ్యామ్ సుందరరావు తదితరులు పాల్గొన్నారు.