‘మొక్కజొన్నలో సస్యరక్షణతో అధిక దిగుబడి’
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:44 PM
) రబీలో దుక్కిదున్నకుండా మొక్కజొన్న సాగుచేసి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాదించవచ్చని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త చిట్టిబాబు తెలిపారు. శుక్రవారం మండలంలోని అల్లాడలో మొక్కజొన్న సాగులో ఎరువులు యాజమాన్యంతో అధికదిగుబడులు సాధనకు అవగాహన సదస్సు నిర్వహించారు.
జలుమూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) రబీలో దుక్కిదున్నకుండా మొక్కజొన్న సాగుచేసి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాదించవచ్చని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త చిట్టిబాబు తెలిపారు. శుక్రవారం మండలంలోని అల్లాడలో మొక్కజొన్న సాగులో ఎరువులు యాజమాన్యంతో అధికదిగుబడులు సాధనకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దున్నకుండా మొక్కజొన్న సాగు చేయడం వల్ల సాగు ఖర్చులు, రెండు, మూడు నీటితడులు ఆదాచేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డిస్ ఫౌండేషన్ ఏరియా మేనేజరు పి.తవిటినాయుడు పాల్గొన్నారు.