హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:53 PM
ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ట్రాఫిక్ ఎస్‌ఐ సుధాకర్ కోరారు.
ట్రాఫిక్ ఎస్‌ఐ సుధాకర్
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ట్రాఫిక్ ఎస్‌ఐ సుధాకర్ కోరారు. ఎస్పీ మహే శ్వరరెడ్డి ఆదేశాల మేరకు ‘అమ్మ జన్మనిస్తే.. హెల్మెట్ పునర్జన్మనిస్తుంది’ అని తయారు చేసిన స్టిక్కర్లను ఆటోలు, బస్సు లకు శుక్రవారం అంటించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమా దాల బారినుంచి రక్షణ కలుగుతుందన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.