Share News

పీఏసీఎస్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:48 PM

పీఏసీఎస్‌ ఉద్యోగుల న్యాయ మైన సమస్యలను పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు.

పీఏసీఎస్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు

మూడోరోజుకు చేరిన రిలే దీక్షలు

అరసవల్లి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): పీఏసీఎస్‌ ఉద్యోగుల న్యాయ మైన సమస్యలను పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. కోర్కెల సాధనకు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో అనేకపర్యాయాలు ప్ర భుత్వానికి వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవ డంతో తప్పని పరిస్థితుల్లో నిరవధిక దీక్షలకు దిగారన్నారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదని, చాలీచాలని వేతనాలతో కుటుం బాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నా రన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీఏీ సఎస్‌ ఉద్యోగులకు జీవో నెంబర్‌ 36 అమలు, వేతన సవరణ చేయాలని, 50 శాతం తగ్గ కుం డా మధ్యంతర భృతి ఇవ్వాలని, పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్‌, జిల్లా కార్య దర్శి మెండ సత్యనారాయణ, సంఘ నేతలు బొడ్డేపల్లి సన్యా సిరావు, కనుగుల రమణ, జానకి రామ్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:48 PM