Share News

‘జిల్లా కోర్టు పరిధిలో మేజిస్ట్రేట్‌ పోస్టుల భర్తీ’

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:52 PM

ఉమ్మడి జిల్లాలోని టెక్కలి, రాజాం, శ్రీకాకుళం (ఎక్సైజ్‌ కోర్టు) కేంద్రాల్లో ఖాళీగా ఉన్న రెండో తరగతి ప్రత్యేక జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు.

‘జిల్లా కోర్టు పరిధిలో మేజిస్ట్రేట్‌ పోస్టుల భర్తీ’

శ్రీకాకుళం లీగల్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని టెక్కలి, రాజాం, శ్రీకాకుళం (ఎక్సైజ్‌ కోర్టు) కేంద్రాల్లో ఖాళీగా ఉన్న రెండో తరగతి ప్రత్యేక జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఐదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు, రిటైర్డ్‌ జ్యుడీషియల్‌ అధికారు లు, గతంలో మెజిస్ట్రేట్‌ అధికారులు నిర్వహించి లా డిగ్రీ కలిగిన విశ్రాం త గజిటెడ్‌ అధికారులు అర్హులన్నారు. అర్హులైన అభ్యర్థులు 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని, ఎంపికైన వారికి నెల కు రూ.45 వేల గౌరవ వేతనంతో పాటు రూ.5 వేలు వాహన భత్యం చెల్లించనున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత దరఖాస్తును జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి అవసరమైన ధ్రువీ కరణ పత్రాలను జతపరిచి మార్చి 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా న్యాయాధికారి, శ్రీకాకుళం వారికి రిజిస్టర్డ్‌ లేదా స్పీడ్‌ పోస్టు ద్వా రా మాత్రమే పంపాలన్నారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - Feb 20 , 2026 | 11:52 PM