గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.
Death of Maoist leader Mettur Joga Rao ఒకప్పుడు సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైన ఉద్దానం ప్రాంతం.. నేడు మూగబోయింది. ఉద్దానం ప్రాంతంలో ఎంతోమంది విప్లవకారులు ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యారు. గతంలో ఎన్‌కౌంటర్ ఘటనల్లో కొందరు మావోయిస్టులు అమరులు కాగా.. మరికొందరు జనజీవన స్రవంతిలో కలిశారు.
కార్య కర్తలకు ఎల్లవేళలా పార్టీ అండదండలు ఉంటాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
Today is World Fisheries Day రాష్ట్రంలో అత్యధిక తీరప్రాంతం ఉండే జిల్లా శ్రీకాకుళం. ఏకంగా 193 కిలోమీటర్లు తీరప్రాంతం కలిగిఉంది. ఇక్కడి మత్స్యకారులు సముద్రం, నదులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో సముద్రం, చెరువుల నుంచి 132 రకాల మత్స్య సంపద లభిస్తుంది. విశాఖపట్నం మాదిరిగా హార్బర్ అందుబాటులో లేకపోవడం, జెట్టీలు పూర్తి కాకపోవడంతో మత్స్యకారులు మోటారు బోట్లతో వేట సాగిస్తున్నారు.
Tidco house పట్టణ ప్రజల సొంతింటి కల నెరవేరడం లేదు. దశాబ్ద కాలం అవుతున్నా టిడ్కో ఇళ్లు పూర్తికావడం లేదు. దీంతో పట్టణాల చెంతనే టిడ్కో ఇళ్లు దిష్టిబొమ్మాల్లా దర్శనమిస్తున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి టీడీపీ హయాంలో పునాది పడింది.
విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలను వినియోగించుకుని విజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నా రు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్య క్రమం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం నిర్వహించారు.
అనాథ, మానసిక దివ్యాంగుల సేవలో మనోబంధు ఫౌండే షన్, రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి పనిచేయడం అభినందనీయ మని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో పదిరోజులుగా జరుగుతున్న పుస్తక మహోత్సవం గురువారంతో ముగిసింది. చివరి రోజు సాహిత్య, బైఙ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంగణం కళకళలాడింది.
తోటూరు గ్రామానికి చెందిన కోనేటి భాస్కరరావు (50) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
ఒడిశా నుంచి ముంబాయికి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిలో ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడగా, మరొక వ్యక్తి పరారయ్యాడు.