‘సమస్యలు పరిష్కరించాలి’
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:22 PM
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కంచిలి, జి.సిగడాం, లావేరు కేంద్రాల్లోని సివిల్ సప్లై గోడౌన్‌లలో పని చేస్తున్న హమా లీలు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
కంచిలి/జి.సిగడాం/లావేరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కంచిలి, జి.సిగడాం, లావేరు కేంద్రాల్లోని సివిల్ సప్లై గోడౌన్‌లలో పని చేస్తున్న హమాలీలు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకం అమలు నుంచి తామంతా గోడౌన్లలో పనిచేస్తున్నా మన్నారు. అయితే సివిల్ సప్లయ్ కార్పొరేషన్, ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి కూలి బకాయిలున్నా అధికారులు స్పందించడం లేద న్నారు. దీంతో కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందులు పడుతు న్నామన్నారు. ఆరు నెలలుగా నూతన అగ్రిమెంట్ చేసి కూలి రేట్లు పెంచాల్సి ఉన్నా ఇంతవరకు పెంచలేదని వాపోయారు. ఇప్పటి కైనా అధికారులు చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లావేరు నిరసనలో హమాలీల యూనియన్ నాయ కులు జి.గౌరీ శంకర్, టి.రాంబాబు, బి.శంకర్, పి.జగదీష్, పి.భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.