Share News

ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:18 PM

విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిది ద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిప్యూటీ డీఈవో ఆర్‌.విజయకుమారి అన్నారు.

ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలి
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ డీఈవో విజయకుమారి

డిప్యూటీ డీఈవో ఆర్‌.విజయకుమారి

ఆమదాలవలస, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిది ద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిప్యూటీ డీఈవో ఆర్‌.విజయకుమారి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత, లక్ష్మీనగర్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాల లను సందర్శించారు. మిడ్డేమీల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యా హ్న భోజన పథకంలో అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేలా చర్యలు తీసు కోవాలని, వంట, భోజనశాలలు, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ధ వహించా లన్నారు. పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యా ర్థులు ఎన్‌సీసీ స్కాలర్‌షిప్‌కు ఎంపికవడంపై ఆమె అభినందించారు. కార్యక్ర మంలో ఇన్‌ చార్జి హెచ్‌ఎం పైల రవికుమార్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌, జీటీఏ సంఘం జిల్లా అధ్యక్షుడు పైడి రామస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 11:18 PM