Share News

ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:08 PM

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)లో శ్రీకాకుళం క్యాంపస్‌లో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి రెండు రోజుల పాటు నిర్వహించిన తొలవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం ముగిసింది.

ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్‌
విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న సిబ్బంది

-ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో 871 సీట్లు భర్తీ

ఎచ్చెర్ల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)లో శ్రీకాకుళం క్యాంపస్‌లో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి రెండు రోజుల పాటు నిర్వహించిన తొలవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఈ నెల 23, 24 తేదీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం 1,010 మంది విద్యార్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానించగా, 871 మంది హాజరై సీట్లు పొందారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో 139 సీట్లు మిగిలాయని ఆర్జీయూకేటీ అధికారులు ప్రకటించారు. తొలివిడతలో సీటు పొందిన విద్యార్థులు క్యాంపస్‌ మారేందుకు వీలుగా స్లైడింగ్‌ ఆప్షన్‌ ఇచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన సీట్లను వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించే రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియను క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం.గిరిధర్‌, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎం.శివరామకృష్ణ, కె.మోహనకృష్ణ చౌదరి పర్యవేక్షించారు. కాగా, ఈ క్యాంపస్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు అధికారులు రెండు జతల యూనిఫాంను అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ క్యాంపస్‌లో సీట్లు పొందారు.

Updated Date - Jun 24 , 2026 | 11:08 PM