ఓ పీహెచ్‌సీలోని ఎంపీహెచ్‌ఎస్ (ఫిమేల్)కి పదోన్నతి ఇవ్వాలంటే రూ.10వేలు ఇవ్వా లంటూ ఓ మెడికల్ ఆఫీసర్ డిమాండ్ చేసిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎచ్చెర్ల తహసీల్దార్ తప్పుడు నివేదిక, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం, ప్రజాప్రతి నిధు లు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ‘రోల్‌బ్యాక్ 22ఎ’లో భాగంగా ఫరీదుపేట గ్రామ పరిధిలోని హైవేకి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 528-34లోని 75 సెంట్ల స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం వాండ్రాడ గ్రామ పంచాయతీ నర్సింగపల్లిలో రూ.3.92 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోలార్ వల్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని వివరించారు. నిమ్మాడలోని తన నివాసం, కార్యాలయంపై సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంటు బిల్లు నెలకు రూ.60వేల నుంచి రూ.1200కు తగ్గిందని వివరించారు.
స్థానిక రైల్వేస్టేషన్ ఫ్లాట్‌పారం-2లో మంగళవారం ఓ మహిళ నుంచి మొత్తం ఏడు ప్యాకెట్లలో 11 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక పచోరి కాలనీలో ఉంటున్న గరికి అనిల్ కుమార్ (34) అనుమానాస్పద రీతిలో మంగళవారం మృతిచెందాడు. స్థానిక ఎస్‌ఐ గణేష్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ
శాంతిభద్రతలు రాష్ట్ర ప్రగతికి పునాది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
మండలంలోని మర్రివలస, కత్తిరివానిపేట, నగిరికటకం, అచ్యుతాపురం, యలమంచిలి, వెలుసోద, పాగోడు, గుగ్గిలి, తాళ్లవలస, కూర్మనాధపురం ప్రాంతాల్లోని తంపర భూముల్లో పంట పొలాలు నీటమునగడంతో వరిదుబ్బులకు మట్టిపట్టి పంట నాశనం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు.
వ్యవ సాయ రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరి జ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టి సారించాల ని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయ ఉపకులపతి (వీసీ) డా.పీవీ సత్యనారా యణ అన్నారు.
టెక్కలి సమీపంలో రైలు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు టి.సూర్యం, దళిత చైతన్య వేదిక అధ్యక్షుడు బసవల గోవిందరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
విద్యా ర్థి దశ నుంచి నైతిక విలువ లు పెంపొం దించడం ద్వారా వారి భవిష్యత్ కు మంచి పునాది వేయవచ్చని, ఈ దిశగా ఉపాధ్యాయులు పాటుపడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు.